కర్ణాటకలోని ఐదు జిల్లాల్లో మోడీ ఎన్నికల ప్రచారం
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధమైంది. కర్ణాటకలోని ఐదు జిల్లాల్లో మోడీ ప్రచారం చేయనున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఈ రోజు తెలిపారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బెంగళూరులో ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులో పాల్గొన్న అనంతరం షెట్టర్ విలేకరులతో మాట్లాడారు. మోడీ సేవలను పార్టీ తప్పకుండా ఉపయోగించుకుంటుందని చెప్పారు. ఆయన ప్రచారం ఈనెల 23 తర్వాత మొదలవుతుంది.